ఆరేళ్ళుగా యువతిని అనుభవించాడు.. ఆ విషయం చెప్పగానే చంపి పెరట్లో పాతేశాడు..?

murder
జె| Last Modified శనివారం, 27 జులై 2019 (14:59 IST)
ఈమధ్య కాలంలో క్షణికావేశంలో హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఒక పరిశోధనలో తేలింది. తాజాగా తిరువనంతపురంలో జరిగిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. కేరళలో నెలరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి ఓ ఇంటి పెరట్లో శవమై కనిపించింది. పోలీసులు ఆ యువతిని రాఖీగా గుర్తించారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే రాఖీ జూన్ 21వ తేదీన ఆఫీస్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది.

అలా వెళ్ళిన కూతురు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు. ఆమె కాల్ హిస్టరీ చెక్ చేశారు. అఖిల్ అనే యువకుడితో రాఖీ పలుమార్లు మాట్లాడినట్లు తెలుసుకున్నారు.

అదే అఖిల్ ఇంటి పెరట్లో ఖననం చేసి రాఖీ శవం కనిపించింది. అఖిల్.. రాఖీలు ఆరేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సహజీవనం చేసి చివరకు పెళ్ళి చేసుకోమన్నందుకు అతి కిరాతకంగా చంపేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.దీనిపై మరింత చదవండి :