ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (06:17 IST)

జమ్మూ కాశ్మీర్‌లో స్వల్ప భూకంపం

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ స్వల్పంగా భూమి కంపించింది.ఇవాళ తెల్లవారుజామున 4.29 గంటలకు పహల్‌గాం వద్ద భూమి కంపించింది.

దీని ప్రభావం రిక్టర్‌ స్కేలుపై 4.1 గా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం ఎక్కడ ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది.

ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా వివారాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది. కాగా సోమవారం హన్లేకి ఈశాన్యాన 51 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.5గా నమోదయ్యింది.