మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (08:59 IST)

జమ్ముకాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌

జమ్ముకాశ్మీర్‌లో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య రెండు గంటలపాటు ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

గురువారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో జమ్ము-శ్రీనగర్‌ రహదారిపై నగ్రోటాలోని బాన్‌ టోల్‌ప్లాజా సమీపంలో భద్రతా దళాలపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు జమ్మూ జిల్లా పోలీస్‌ చీఫ్‌ ఎస్‌ఎస్‌పి.శ్రీధర్‌ పాటిల్‌ తెలిపారు. ఒక వాహనంలో వచ్చిన నలుగురు ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని అన్నారు.

దీంతో టోల్‌ప్లాజాను మూసివేసి, భారీ సంఖ్యలో సైనికులను మోహరించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి 31న కూడా ఇదే తరహాలో ఉగ్రవాదులు దాడి చేశారని రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టెనెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనందర్‌ తెలిపారు.

జనవరి 31న కొందరు ఉగ్రవాదులు బాన్‌టోల్‌ప్లాజా సమీపంలోని భద్రతాదళాలపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా, ఒక జవానుకు గాయాలైన సంగతి తెలిసిందే.