అదానీ వివాదంపై కమిటీ ఏర్పాటు..
అదానీ వివాదంపై కమిటీ ఏర్పాటు అయ్యింది. అదానీ -హిండన్ బర్గ్ వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. హిండన్ బర్గ్ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో ఈ కమిటీ విచారించనుంది.
బ్యాంకింగ్ రంగ నిపుణులు కేవీ కామత్, ఓపీ భట్‌తో పాటు ఇన్‌ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని, మరో రిటైర్డ్ జడ్జ్ జేపీ దేవ్‌ధర్ ఈ కమిటీ సభ్యులిగా నియమించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సెబీ తన విచారణను కొనసాగించి రెండు నెలల్లోగా ఈ అంశంపై రిపోర్ట్‌ను సమర్పించాలని తేల్చి చెప్పారు. ఇకపోతే.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విధానాల్లో ఎలాంటి మార్పులు అవసరమో ఈ నిపుణుల కమిటీ సూచించనుంది.