శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (13:36 IST)

చిదంబరానికి జైలులో నిద్రపట్టట్లేదట...

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంకు ప్రత్యేక మంచం ఏర్పాటు చేయకపోవడంతో ఆయన జైలులో సరిగా నిద్రపోలేకపోయారు. 74 యేళ్ల వయసు ఉన్న చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన వేరే మంచం అడిగారు. కానీ వైద్య సలహా లేకుండా అలా చేయలేమని అధికారులు చెప్పడం తో ఆయన అలాగే బల్లమంచంపై గడిపారు. సరిగా నిద్రపోలేదని, చికాకుగా, ఆందోళనగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. 
 
తీహార్ జైలులోని తొమ్మిదో వార్డులో ఏడో నెంబర్ గదిని చిదంబరంకు కేటాయించిన విషయం తెల్సిందే. తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్ర లేచిన ఆయన కాసేపు జైలు ఆవరణలోనే కొంతసేపు మార్నింగ్‌ వాక్‌ చేశారు. అనంతరం ఆధ్మాత్మిక గ్రంథాలను పఠించారు. వాటిలో ఎక్కువ భాగం తమిళం, ఇంగ్లీషుల్లో ఉన్నవే. అనంతరం పాలు, బ్రెడ్‌ తీసుకున్నారు. ఓట్స్‌తో చేసిన సంగటి (పారిడ్జ్‌)ను ఆయనకు బ్రేక్‌ఫా్‌స్టగా ఇచ్చారు. ఆ తర్వాత కాసేపు లైబ్రరీలో దినపత్రికలు చదివారు.