ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా : ఆ సమస్యతో...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోమారు ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. ఇటీవలే కరోనా వైరస్ బారినపడి కోలుకుని త్వరలోనే ఇంటికి డిశ్చార్జ్ కావాల్సివుంది. ఇంతలోనే ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీనికి కారణంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం.
కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన తర్వాత అమిత్ షా గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో రెండు వారాలుగా చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. ఇటీవలే 'తనకు నెగెటివ్ వచ్చిందని, ఈశ్వరుడిని కృతజ్ఞతలు' తెలుపుతున్నానని అమిత్ షా ప్రకటన కూడా చేశారు.
అయినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేవరకు మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని అనుకున్నారు. అయితే, ఆయన మేదాంత ఆసుపత్రిలో శ్వాసకోశ సమస్యతో పాటు చెస్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను అక్కడి నుంచి సోమవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్‌లోనే ఇకపై ఆయన చికిత్స తీసుకోనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు.