సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (16:48 IST)

హాస్టల్ భవనంపై నుంచి దూకి మెడికో ఆత్మహత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఎయిమ్స్ హాస్ట‌ల్ భ‌వ‌నంపై నుంచి దూకి 22 ఏళ్ళ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమ‌వారం సాయంత్రం హాస్ట‌ల్ భ‌వ‌నం ప‌క్క‌న తీవ్ర గాయాల‌తో ప‌డివున్న విద్యార్థిని తోటి విద్యార్థులు గ‌మ‌నించారు. 
 
వెంట‌నే ఎయిమ్స్‌లోని ట్రామా సెంట‌ర్‌లో చేర్చ‌గా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే అతని ఆత్మ‌హ‌త్య‌కుగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కాగా మృతిచెందిన విద్యార్థి క‌ర్ణాట‌క‌కు వాసి అని, 2018 బ్యాచ్‌కు చెందిన‌వాడ‌ని పోలీసులు తెలిపారు.
 
అయితే, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విద్యార్థి గ‌త కొంత కాలంగా మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నాడ‌ని, ఎయిమ్స్‌లోని సైకియాట్రీ విభాగంలో చికిత్స చేయించుకునేవాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. దీనిపై స్థానిక పోలీసులు కేస నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.