గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (16:22 IST)

వాలెంటైన్స్ డే రోజున కౌ హగ్ డే.. కేంద్రం యూటర్న్

cow2
కౌ హగ్ డేను వాలెంటైన్స్ డే రోజున జరుపుకోవాలని ఉత్తర్వులు విడుదల చేసిన కేంద్రం యూటర్న్ తీసుకుంది. కౌ డేపై సోషల్ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. 
 
భారత సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవు వెన్నముక అని, దానిని కౌగిలించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆ ఉత్తర్వుల్లో కేంద్ర పశుసంవర్ధక బోర్డు (ఏవీబీఐ) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కానీ వాలెంటైన్స్ డే నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం కౌ హగ్ డేను ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది.