సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (17:33 IST)

ఢిల్లీ సీఎం సతీమణికి కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్‌కు కేజ్రీవాల్

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కరోనా కల్లోలమే సృష్టిస్తోంది.. రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో తీవ్రతకు బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో.. ఆరు రోజుల పాటు ఢిల్లీ సర్కార్ లాక్‌డౌన్ కూడా ప్రకటించింది. అది ఆరు రోజుల పాటు అమల్లో ఉండనుంది.
 
అయితే, తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సతీమణి సునీతకు కరోనా సోకింది.. ఆమె మహమ్మారి బారిన పడడంతో.. ముందు జాగ్రత్త చర్యగా సీఎం కేజ్రీవాల్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. సునీత కేజ్రీవాల్ హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటుండగా.. సీఎం హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. 
 
కాగా, ఢిల్లీలో కోవిడ్ సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. ఈ మధ్య 20 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి.. క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తుండగా.. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత కూడా వేధిస్తోంది.