మాజీ సీఎం పీఏ అరెస్ట్.. ఎందుకంటే లక్షలు స్వాహా చేయడంతో..?
తమిళనాడు మాజీ సీఎం కె. పళనిస్వామి పీఏ మణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన మాజీ సీఎం వ్యక్తిగత సహాయకుడు ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. నైవేలి ప్రాంతానికి చెందిన తమిళ్ సెల్వన్ అనే వ్యక్తి రవాణా కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం కోసం మణికి రూ. 17లక్షలు చెల్లించాడు.
అయితే మణి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో బాధితుడు తన డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో అందుకు నిరాకరించాడు.
అంతేగాకుండా బాధితుడిని వేధించడం మొదలెట్టాడు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా క్రైం బ్రాంచ్ పోలీసులు పళని సామి పీఏను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో వుంది.