బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (15:11 IST)

పోలీస్ స్టేషన్లోనే స్టెప్పులు ఇరగదీసిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఓ హిందీ పాటకు పోలీస్ స్టేషన్‌లోనే స్టెప్పులేశాడు. దీంతో వేరే పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. ఈ ఘటన బెంగాల్‌లోని అసన్‌సోల్ దుర్గపూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోగల హిరపూర్ పోల

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఓ హిందీ పాటకు పోలీస్ స్టేషన్‌లోనే స్టెప్పులేశాడు. దీంతో వేరే పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. ఈ ఘటన బెంగాల్‌లోని అసన్‌సోల్ దుర్గపూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోగల హిరపూర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే హిరపూర్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న క్రిష్ణ సధన్ మండల్... పోలీస్ స్టేషన్‌లోనే ఓ పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇతడు డ్యాన్స్ చేస్తుండగా.. తోటి మహిళా ఉద్యోగులు కూడా చప్పట్లు కొట్టారు.

అయితే సబ్ ఇన్‌స్పెక్టర్ స్టెప్పులేసిన వీడియోను మరో పోలీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో క్రిష్ణ సధన్‌ వేరొక పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావాల్సి వచ్చింది. మీరూ  ఆ వీడియోను ఓ లుక్కేయండి.