పంజాబ్‌లో గ్యాస్ లీక్.. తొమ్మిది మంది మృత్యువాత
పంజాబ్ రాష్ట్రంలోని ఘోర సంఘటన ఒకటి జరిగింది. ఈ రాష్ట్రంలోని లుథియానాలోని గియాస్‌పుర ప్రాంతంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అసలు లీకైన గ్యాస్ ఏంటి? ఎక్కడి నుంచి వెలువడింది? వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న జాతీయ విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానిక యంత్రాంగం, పోలీసులతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గ్యాల్ లీకైన ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఇళ్లలో నుంచి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.