సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (11:29 IST)

అయోధ్యలో రాముడి విగ్రహం.. 10 వెండి బాణాలిస్తున్న ముస్లింలు...

రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే యూపీలోని కొన్ని ముస్లింలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో.. అయోధ్యలో నిర్మించతలపెట్టిన 100 మీటర్ల అతిపెద్ద రాముడి విగ్రహానికి వెండి బాణాలు బహూకరించేందుకు కూడా ముస్లింలు ము

రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే యూపీలోని కొన్ని ముస్లింలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో.. అయోధ్యలో నిర్మించతలపెట్టిన 100 మీటర్ల అతిపెద్ద రాముడి విగ్రహానికి వెండి బాణాలు బహూకరించేందుకు కూడా ముస్లింలు ముందుకొచ్చారు. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ లేఖ రాసింది. రాముడికి తాము పది వెండి బాణాలు ఇవ్వాలనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొంది. 
 
అయోధ్య రాముడికి వెండి బాణాలను బహుమానంగా ఇవ్వాలని షియాలు కోరుకుంటున్నారని బోర్డ్ చైర్మన్ వసీమ్ రిజ్వీ వెల్లడించారు. తాము రాముడికి బహూకరించనున్న బాణాలు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధానికి ప్రతీకలని అభివర్ణించారు. రాముడు దుష్టశక్తులపై పోరాడి బాణాలతోనే రాక్షసులను సంహరించాడని.. ప్రస్తుతం తామివ్వబోయే బాణాలు కూడా టెర్రరిస్టులపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రతీకలని లేఖలో తెలిపారు.