అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు.. తీర్పు చదవడం ప్రారంభం..

ayodhya
సెల్వి| Last Updated: శనివారం, 9 నవంబరు 2019 (10:44 IST)
అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరిస్తోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శనివారం ఉదయం 10.30కు తుది తీర్పును చదవడం ప్రారంభించారు.
ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిన్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును చదివి వినిపిస్తోంది.

ఈ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉన్నా అందరూ సంయమనం పాటించాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. అదే క్రమంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది.

అయోధ్య కేసు విచారణను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న పూర్తి చేసింది. వివాదాస్పద స్థలం మొత్తం విస్తీర్ణం.. 2.77 ఎకరాలు. ఈ భూమిపై దశాబ్దాల నాటి వివాదంలో హిందూ, ముస్లిం పక్షాల వాదనలు సాగాయి.దీనిపై మరింత చదవండి :