బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (11:19 IST)

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో దాడి.. ఆ వ్యక్తి ఎవరు?

Bengaluru Rameshwaram Cafe
Bengaluru Rameshwaram Cafe
బెంగుళూరులో మార్చి 1వ తేదీన రామేశ్వరం కేఫ్‌లో జరిగిన గుండువేడి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెంగళూరు ఓయిట్‌పీల్డు రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం బాంబు పేలింది. 
 
ఇందులో కేఫ్ సిబ్బంది ఫరూక్ హూసేన్ (26), డివిపాన్సూ (25)తో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఐటీలో పనిచేసే మహిళా టెక్కీలు వున్నారు. బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్, సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో అనుమానితుడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
మరోవైపు రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, ఘటనపై 7-8 బృందాలను ఏర్పాటు చేశామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శుక్రవారం తెలిపారు.
 
 ఒక యువకుడు వచ్చి చిన్న బ్యాగ్‌ని ఉంచాడని, గంట తర్వాత అది పేలిపోయిందని శివకుమార్ పేర్కొన్నాడు.