శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (08:40 IST)

టపాసులపై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని సవాల్.. నిండు ప్రాణం బలి (Video)

crackers blast
తన స్నేహితుల సవాల్‌ను స్వీకరించిన ఓ యువకుడు తన ప్రాణాలను కోల్పోయాడు. ఒక యువకుడుని భారీ శబ్దాలతో పేలే బాణాసంచాపై స్టీల్ బాక్స్ పెట్టి ఆ బాక్సుపై కూర్చోగలవా అంటూ కొందరు స్నేహితులు రెచ్చగొట్టారు. దీన్ని ఓ సవాల్‌గా స్వీకరించిన ఓ యువకుడు ఆ బాక్సుపై కూర్చున్నాడు. ఇతర స్నేహితులు టపాసులను నిప్పుపెట్టాడు. అవి భారీ శబ్దంతో పేలాయి. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన బెంగుళూరు నగరంలోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మృతుడిని శబరీష్‌ అనే యువకుడిగా గుర్తించారు. 
 
బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధి వీవర్స్ కాలనీలో టపాసులపై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని కొందరు స్నేహితులు సవాల్ విసిరారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న శబరీష్ మద్యం మత్తులో అలాగే చేయడంతో క్రాకర్లు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 2వ తేదీన ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.