బీహార్ ఎన్నికలు : మహాకూటమి విజయభేరీ... కుదేలైన కమలనాథులు

nitish - lalu
pnr|
బీహార్ ఓటర్లు బీజేపీని చావుదెబ్బ కొట్టి.. మహాకూటమికి స్పష్టమైన మెజార్టీని ఇచ్చారు. తద్వారా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వెసులుబాటు కల్పించారు.

మొత్తం 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీకి ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఈ లెక్కింపుల్లో ప్రారంభ ట్రెండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, ఉదయం 10 గంటల సమయంలో మహాకూటమి అనూహ్యంగా పుంజుకున్నారు. ఈ ట్రెండ్ ఎన్నికల ఫలితాలు వెలువడయ్యేంత వరకు కొనసాగింది.

మొత్తం 243 సీట్లలో మహాకూటమి అభర్థులు సాయంత్రం 4 గంటల సమయానికి 144 చోట్ల విజయం సాధించగా, 34 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే, ఎన్డీయే కూటమి అభ్యర్థులు 41 చోట్ల గెలుపొందగా, 17 చోట్ల మెజార్టీలో ఉన్నారు. ఇకపోతే.. ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందగా, ఒక సీటులో ఆధిక్యంలో ఉన్నారు.దీనిపై మరింత చదవండి :