గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 జులై 2024 (08:39 IST)

మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఎల్కే అద్వానీ!!

lk advani
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ మరోమారు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. 96 యేళ్ల అద్వానీ అస్వస్థతకు లోనుకావడంతో కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, గత నెల 26వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా వైద్యులు సర్జరీ చేసి ఇంటికి పంపించారు. తాజాగా ఆయన మరోమారు అస్వస్థకు గురికావడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.