1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (12:07 IST)

ఎల్‌కే అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం: నరేంద్ర మోడీ అభినందనలు

Narendra Modi-LK Advani
కర్టెసి-ట్విట్టర్
భాజపా కురువృద్దులు, సీనియర్ నాయకులు, ఆ పార్టీకి వెన్నెముక అయిన ఎల్.కె. అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్వయంగా తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో... శ్రీ ఎల్‌కే అద్వానీజీకి భారతరత్న ఇవ్వబడుతుందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. నేటి రాజకీయ వ్యవస్థలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది.
 
అట్టడుగు స్థాయి నుంచి పని చేస్తూ మన దేశ ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం ఆచరణీయం. ఆయన మన హోం మంత్రిగా, I&B మంత్రిగా కూడా గుర్తింపు పొందారు. ఆయన పార్లమెంటరీ విధానాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప అంతర్దృష్టులతో నిండి ఉన్నాయి." అని పేర్కొన్నారు.