బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (10:39 IST)

లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలుస్తాం.. చెప్పిందెవరు?

bjp
bjp
2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 350 సీట్లకు పైగా గెలుస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని.. భవిష్యత్ సవాళ్లను చర్చిస్తానని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లు దాటుతాం అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
 
అలాగే G20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పొందుతున్నామన్నారు. గోవాలో కూడా దాదాపు ఎనిమిది సమావేశాలు నిర్వహించబడతాయి. కాబట్టి ఈ కార్యకలాపాలన్నింటినీ ప్రోత్సహించడానికి కసరత్తు జరుగుతుందని చెప్పుకొచ్చారు. పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని గౌతమ్ అన్నారు.