పసిగుడ్డును చిదిమేశారు : ఆరు నెలల చిన్నారిని రేప్ చేసి హత్య
దేశంలో బాలికలు, చిన్నారులు, చివరికి పసిగుడ్డులకు కూడా రక్షణ కరువైంది. వీరిపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ముఖ్యంగా ఈ క్రూర అకృత్యాలు హృదయాలను పిండేస్తున్నాయి.
దేశంలో బాలికలు, చిన్నారులు, చివరికి పసిగుడ్డులకు కూడా రక్షణ కరువైంది. వీరిపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ముఖ్యంగా ఈ క్రూర అకృత్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. దేశంలో ఏదో ఒక మూల చోటు చేసుకున్న అఘాయిత్యాల తీరు, హత్యలు ప్రతీ మనిషినీ ఆందోళనకి గురిచేస్తున్నాయి.
ఇటీవల కథువా, ఉన్నావ్, సూరత్, చత్తీస్‌ఘడ్.. ఇలా పలు ప్రాంతాల్లో అభంశుభం తెలియని చిన్నారులు అత్యాచారానికి గురయ్యారు. ఇపుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ పసికందు కామాంధుడి అకృత్యానికి మౌన సాక్ష్యంగా మిగిలింది.
ఆరు నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం. ఈనెల 20వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం ఓ కమర్షియల్ కాంప్లెక్స్ సెల్లార్‌లో రక‍్తపు మడుగులో ఆరు నెలల శిశువు మృతదేహం పడి ఉంది. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా.. నిందితుడిని సునీల్ భీల్(21)గా గుర్తించారు.
పాప శరీరంలోని ప్రైవేట్ భాగాల్లోనూ, తలపైన గాయాలను గుర్తించినట్టు చెప్పారు. బాధితురాలు తల్లిదండ్రులు రాజ్వాడాలో బెలూన్లు అమ్ముకుని జీవిస్తారని, నిందితుడు కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసు అధికారి మిశ్రా వెల్లడించారు.