విమానంలో వీరకుమ్ముడు... వీడియో వైరల్
కొందరు విమాన ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టుగానే వారు భావిస్తూ, విమాన ప్రయాణ సమయాల్లో తోటి ప్రయాణికులపై చేయి చేసుకుంటున్నారు. తాజాగా కొచ్చిన్ నుంచి చెన్నైకు వస్తున్న ఓ ప్రైవేటు విమానం టేకాఫ్ అవుతుండగా, ఓ విదేశీ ప్రయాణికుడుతో పాటు మరో ఇద్దరు స్వదేశీ ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగి దాడికి దారితీసింది.
ఓ ప్రయాణికుడు విమానంలో బాంబు పెడతామని బెదిరించాడు. దీంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దాదాపు 3 గంటల పాటు అధికారులు, భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు కనిపించకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య చెలరేగిన ఘర్షణ దాడికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆ వీడియో మీరే చూడండి.