మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (22:13 IST)

గుజరాత్‌ మచ్చూ నదిపై తెగిన కేబుల్ బ్రిడ్జి - 32 మంది మృత్యువాత

cable bridge
గుజరాత్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. మోర్బీ ప్రాంతంలో కేబుల్ వంతెన తెగిపోయింది. దీంతో 32 మంది మృత్యువాతపడ్డారు. మరో 400 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 70 మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. 
 
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి ఎప్పటి నుంచో ఉండగా, ఐదు రోజుల క్రితమే ఈ కేబుల్ వంతెనకు ఆధునకీకరణ పనులుచేశారు. ఈ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా తెగిపోయింది. 
 
ఆ సమయంలో వంతెనపై దాదాపు 500 మంది వరకు ఉన్నట్టు సమాచారం.  వంతెన కూలిపోగానే చాలా మంది నదిలో పడిపోయారు. వీరిలో ఈత తెలిసినవారు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయినప్పటికీ 32 మంది చనిపోయారు. 
 
ప్రమాద వార్త తెలియగానే ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి ఈ ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 
 
అంతేకాకుండా, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాయి. గాయపడిన వారికి రూ.50 వేలు సాయాన్ని ప్రకటించాయి.