గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (09:07 IST)

మైనర్ బాలికపై ఎస్పీ లైంగికదాడి...

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు, లైంగికదాడులు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం పోకిరీలు మాత్రమే కాకుండా, మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు సైతం ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అస్సాం రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై కామాంధుడైన ఎస్పీ లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ ఘటన అస్సాం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్బీ అంగ్ లాంగ్ పట్టణ ఎస్పీగా గౌరవ్ ఉపాధ్యాయ్ పని చేస్తున్నాడు. ఈయన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ వ్యవహారం పెను వివాదానికి దారితీయడంతో పోలీస్ కమిషనర్ ఎంపీ గుప్తా, కేసును నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే, బాలిక ఫిర్యాదుతో ఎస్పీ గౌరవ్‌పై పోస్కో చట్టంలోని సెక్షన్ 10 కింద కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా, ఎస్పీని విధుల నుంచి తప్పించినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఈ కేసు, తనపై కక్ష సాధింపు కోసమే పెట్టారని గౌరవ్ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.