శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

బిన్‌లాడెన్‌ ను పట్టేశారోచ్!

ఎట్టకేలకు అసోం అటవీ అధికారులు బిన్‌ లాడెన్‌ ను పట్టేశారు. అవును నిజమే అసోం అటవీ అధికారులు పట్టుకున్నది మనుషుల ప్రాణాలను తీసేస్తున్న బిన్‌ లాడెన్‌ నే. అయితే ఈ బిన్‌ లాడెన్‌ ఒక ఏనుగు.

అసోం గోల్పారా జిల్లాలో స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తూ పలువురి ప్రాణాలు హరించేసిన ఓ ఏనుగుకు అక్కడి ప్రజలు ’ఒసామా బిన్‌ లాడెన్‌’ అని పేరు పెట్టారు. గత అక్టోబర్‌లో అసోంలోని గోల్పారా జిల్లాలో ఈ ఏనుగు ఐదుగురిని చంపేసింది.

ఈ కిల్లర్‌ బిన్‌ లాడెన్‌ ను పట్టుకునేందుకు అష్టకష్టాలూ పడ్డారు. ఎప్పుడొస్తుందో, ఎక్కడ నుంచొస్తుందో తెలియకుండా ఒక్కసారిగా జనావాసాలపై దాడి చేసి అందిన వారిని అందినట్లు తొండంతో కొట్టో, కాళ్లతో మట్టి చంపేసి మళ్లీ అడవిలోకి పారిపోయే ఈ ఏనుగును అధికారులు పట్టుకోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.