మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (15:00 IST)

ఆర్.సి., డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గడువుపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక రకాలైన సేవలకు అంతరాయం కలిగింది. ఇలాంటివాటిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల అనుమతి తదితర అనుమతులు పొందేందుకు గడువు ఇచ్చింది. ఇపుడు దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో ఈ అనుమతులకు గడువు మరోమారు పొడగించే అవకాశమే లేదని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. 
 
డీఎల్‌, ఆర్‌సీ డాక్యుమెంట్ల చెల్లుబాటు గడువును పొడిగించేందుకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఇకపై గడువు పొడిగింపు ఉండదని, ఈ నెలాఖరులో (అక్టోబర్‌ 31) వరకు సమయం ఇచ్చింది. ప్రస్తుతం సడలింపును ఎత్తివేయాలని నిర్ణయించిన కేంద్రం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు తర్వాత సంబంధిత డాక్యుమెంట్లలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేసింది.
 
కాగా, గతేడాది ఫిబ్రవరి 1న ముగిసిన అన్నీ వాహన పత్రాల గడువును కేంద్రం పొడగిస్తూ వచ్చింది. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో గడువు ముగిసిన అనంతరం చట్టవిరుద్ధంగా పరిగణించనున్నారు. కరోనా కాలంలో కేంద్రం ఇప్పటివరకు 8 సార్లు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తదితర పత్రాల వ్యాలిడిటీని పొడిగిస్తూ వచ్చింది.
 
ఇందుకు మోటార్‌ వాహనాల చట్టం, 1988 అండ్‌ సెంట్రల్‌ మోటార్‌ సమయంలో, మోటార్ వాహనాల చట్టం, 1988 మరియు సెంట్రల్ మోటార్ వాహనాల నియమాలతో పాటు సంబంధిత పత్రాల చెల్లుబాటు కోసం నిబంధనలు సడలించింది. తొలిసారిగా గతేడాది మార్చి 30 వరకు సడలింపు ఇవ్వగా.. ఆ తర్వాత.. జూన్ 9, 2020 వరకు, మళ్లీ ఆగస్టు 24 వరకు, అనంతరం డిసెంబర్ 27వరకు పొడిగించింది. మళ్లీ మార్చి 26 వరకు, అనంతరం ఈ ఏడాది జూన్ 17 వరకు.. మళ్లీ సెప్టెంబర్ 30వరకు, చివరిసారిగా అక్టోబర్ 31 వరకు పొడగించింది.