సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (18:33 IST)

పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్.. జూన్ 30 వరకు గడువు పెంపు

పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేసేందుకు గడువును అనేక సార్లు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. 2021 మార్చి 31న ముగిసిన గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నందున పాన్ కార్డ్ హోల్డర్లకు మరో అవకాశం ఇచ్చేందుకు ఆదాయపు పన్ను శాఖ మరోసారి గడువు పెంచింది. అంటే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి మరో నెల రోజులు మాత్రమే గడువుంది. 
 
అయితే ఇప్పటికే కోట్లాది మంది తమ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేశారు. మీ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.