ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:26 IST)

ఇకపై కారులో ఆరు ఎయిర్ బ్యాగులు.. అక్టోబరు ఒకటి నుంచి కొత్త నిబంధన

nitin gadkari
కేంద్ర రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కారులో ప్రయాణించే వారి భద్రతపై దృష్టిసారించింది. దీంతో కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్ బ్యాగులు అమర్చాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధన అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఇటీవల టాటా అండ్ సన్స్ మాజీ ఛైర్మన్ సైరన్ మిస్త్రీ కారు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఈయన కారు వెనుక సీట్లో కూర్చొని ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంపై కేంద్ర రవాణా శాఖ సమగ్ర అధ్యయనం చేసింది.

ఇకపై జరిగే ప్రమాదాల్లో ముందు సీట్లో కూర్చున్న వారేకాకుండా వెనుకసీట్లో కూర్చున్న వారు కూడా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ సరికొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.

ఈ కొత్త నిబంధన అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. ఇకపై ప్రతి కారులో కనీసం ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

కార్లు వేరియంట్లు, ధరతో సంబంధం లేకుండా ప్రతి కారులో ముందు, వెనుక సీట్లలో కూర్చొన్న ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆరు ఎయిర్ బ్యాగులు అమర్చాల్సిందేనంటూ ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.