గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (22:38 IST)

చంద్రయాన్-3 -ల్యాండర్ ఫోటోను విడుదల చేసిన ఇస్రో

Chandrayaan 3
Chandrayaan 3
చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగి రికార్డు సృష్టించింది. కాగా, చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్ తీసిన చంద్ర ఉపరితల చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్-3 ల్యాండర్, బెంగళూరులోని గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ మధ్య కమ్యూనికేషన్ లింక్ ఏర్పడింది. దీని తరువాత, ఇస్రో విక్రమ్ ల్యాండర్ ఫోటోను విడుదల చేసింది. 
 
ఈ సందర్భంలో, విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలుమోపిన తర్వాత ఇస్రో తన ల్యాండింగ్ ఇమేజర్ కెమెరా ద్వారా తీసిన ఫోటోను విడుదల చేసింది. ఫోటో చంద్రయాన్-3 ద్వారా చంద్రుని ల్యాండింగ్  భాగాన్ని చూపుతుంది. ల్యాండర్ నీడలో నాలుగింట ఒక వంతు కూడా కనిపిస్తుంది.