1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:26 IST)

పంజాబ్ సీఎం పీఠంపై తొలి దళిత నేత... ప్రమాణ స్వీకారం పూర్తి

పంజాబ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ఓ దళిత చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. దీంతో పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా చన్నీ నిలిచారు. 
 
కాంగ్రెస్ అధిష్టానం తనను అవమానిస్తుందని పేర్కొంటూ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్‌ కొత్త సీఎంగా చన్నీని కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక చేసింది. 
 
దీంతో ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దూ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సీఎంకు రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
 
కాగా, చన్నీ మాల్వా బెల్డ్‌లో రూప్‌నగర్‌ జిల్లాలోని చామ్‌కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అమరీందర్‌ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెల్సిందే.