1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

chinab river
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను భారతీయ రైల్వే శాఖ నిర్మించింది. కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లా సాంగ్లదాన్, రియాసీ జిల్లాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా రైల్వే శాఖ తెలిపారు. ఈ ట్రైల్ వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్వరలోనే ఈ వంతెనపై రైళ్ల రాకపోకలను నడుపనున్నారు.
 
రాంబన్ జిల్లాలోని సాంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ట్రయల్ రన్ విజయవంతమవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. త్వరలో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని అన్నారు. భారత్‌లో ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా.. కాశ్మీర్ లోయలోని బారాముల్లా నుంచి సంగల్దాన్ వరకూ రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా పూర్తయిన ఈ వంతెన ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారనుంది.
 
రైలు మార్గం ద్వారా కాశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్ల ఎత్తు) పేరుతో ఉన్న ప్రపంచరికార్డును ఇది అధిగమించింది. ప్రపంచ ప్రఖ్యాత ఐఫిల్ టవర్ కంటే చీనాబ్ వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.