సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (14:57 IST)

మనిషి కాదు.. మృగాడు... లేగదూడపై కారు ఎక్కించి చంపేశాడు... (Video)

calf crush
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి అతికిరాతక చర్యకు పాల్పడ్డాడు. రోడ్డుపై పడుకునివున్న లేగదూడపై కారు ఎక్కించి చంపేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రోడ్డుపై పడుకునివున్న ఓ లేగదూడపైకి ఓ వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా తన హ్యూందాయ్ కారును ఎక్కించాడు. అంతేకాకుండా, మళ్ళీ వెనక్కి వచ్చి మరోమారు దానిపైకి కారును ఎక్కించాడు. దీంతో ఆ లేగ దూడ చనిపోయింది. అయితే, తన బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి ఆవు తల్లడిల్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 
 
అలాగే, అక్కడ ఉన్న 7 నుంచి 8 ఆవులు మార్గమధ్యంలో చనిపోయి పడివున్న దూడ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నంబరును తెలుసుకుని, ఆ వివరాల ఆధారంగా కారు యజమాని షేక్ షాహిద్‌గా గుర్తించారు. ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.