శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (11:28 IST)

జనవరి-ఫిబ్రవరిలో చిన్నారులకు కోవోవాక్స్‌!

'చిన్నారుల కోసం కోవోవాక్స్‌ వ్యాక్సిన్‌ను వచ్చే తొలి త్రైమాసికంలో అందుబాటులోకి తెస్తాం. జనవరి-ఫిబ్రవరిలో రావొచ్చు' అని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిఇఒ అదర్‌ పూనావాలా తెలిపారు.

వయోజనులకు చెందిన కోవోవాక్స్‌ అక్టోబర్‌లో అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయని, డిసిజిఐ ఆమోదంపై ఆధారపడి ఉందని అన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ను ధరను అందుబాటులోకి తెచ్చే సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.

ప్రస్తుతం నెలకు 130 మిలియన్‌ డోసులు కోవిషీల్డ్‌ ఉత్పత్తి చేస్తున్నామని, ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశాలున్నాయని చెప్పారు.

అదేవిధంగా అన్ని విధాలుగా సీరమ్‌ సహకరిస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన... డిమాండ్‌ నేపథ్యంలో కోవిషీల్డ్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరిచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

'కేంద్రం మాకు సహకారం అందిస్తుండటంతో... ఆర్థిక ఇబ్బందులు లేవు. మాకు సహాయ సహకారాలు అందించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు' అని అన్నారు.