మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (17:12 IST)

అమితాబ్ బచ్చన్‌కు "భారత్ రత్న" ఇవ్వాలి : మమతా బెనర్జీ

mamata benerjee
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌‍కు "భారత రత్న" ఇవ్వాలని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోరారు. ఈ మేరకు ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమితాబ్ బచ్చన్ ఒక లెజెండ్, భారత్‌కే ఆయన ఓ ఐకాన్ అని కొనియాడారు. 
 
భారతీయ సినీ పరిశ్రమకు, ప్రపంచ సినీ పరిశ్రమకు ఆయన ఎంతో చేశారని తెలిపారు. భారత రత్నకు అమితాబ్ అన్ని విధాలా అర్హుడని చెప్పారు. కోల్‌కతాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయాబచ్చన్, బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరలు పాల్గొన్నారు.