శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (16:37 IST)

అప్పు తిరిగి ఇవ్వమంది.. బీఫ్ తినిపించి అత్యాచారం.. వీడియో తీసి?

gang rape
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దళిత మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె చేత బలవంతంగా బీఫ్ తినిపించారు. ఈ అకృత్యాన్ని వీడియో తీశారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బరేలీ జిల్లాకు చెందిన దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చింది. తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో సెప్టెంబర్‌ 2వ తేదీన ఓ కేఫ్‌కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్‌ చేసి చెప్పింది. అయితే తన స్నేహితురాలితో పాటు మరో ఇద్దరు ముస్లిం యువకులు కూడా అక్కడ వున్నారు. వీరు ముగ్గురూ కలిసి దళిత యువతిని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకులు ఆమెతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. 
 
అనంతరం ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి.. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకా ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆ వీడియోని యువతికి కాబోయే భర్తకు పంపించారు. దీంతో విసిగిపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులందరినీ అరెస్టు చేశారు.