సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (14:35 IST)

ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె

కన్నతల్లి అనే కనీస కనికరం కూడా లేకుండా, తనకు అడ్డు తగులుతుందన్న ఆగ్రహంతో ఒక యువతి, అతి క్రూరంగా తన తల్లిని హత్య చేసింది. కర్ణాటకలో కలకలం రేపిన ఈ ఘటన బెంగళూరు కేఆర్ పురంలోని అక్షయనగర్ పరిధిలో జరిగింది. 
 
ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నిర్మల తన కుమారుడు, కుమార్తె అమృతలతో కలిసి అక్షయ నగర్‌లో నివాసం ఉంటోంది. తన తల్లితో నిత్యం గొడవలు పడుతూ ఉండే అమృత, నిన్న జరిగిన వాగ్వాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోగా, అప్పటికే కోపంతో ఉన్న అమృత, కత్తిని తీసుకుని వెళ్లి, తల్లిని దారుణంగా పొడిచి, హత్య చేసి పరారైంది. 
 
దీన్ని చూసిన కుమారుడు కూడా పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలసుకున్న కేఆర్ పురం పోలీసులు, ఘటనా స్థలిని సందర్శించి కేసు నమోదు చేసి, అమృత కోసం గాలిస్తున్నారు. తాను ప్రేమించిన ప్రియుడితో పెళ్లి చేయమని తరచూ తల్లితో అమృత గొడవపడటం అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతోనే హత్య చేసి పరారైనట్లు పోలీసులు విచారణలో తేలింది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.