గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated: బుధవారం, 21 సెప్టెంబరు 2022 (11:28 IST)

హస్తినలో దారుణం : నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన ట్రక్కు

road accident
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నిద్రిస్తున్నవారిపై ఓ ట్రక్కు దూసుకెళ్లింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హస్తినలోని సీమాపురి రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపై అమిత వేగంగా వచ్చిన ఈ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డివైడర్‌పై నిద్రపోతున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
నిద్రపోతున్న వారిపైకి దూసుకెళ్లి ప్రాణాలు బలిగొన్న ట్రక్కును కనుగొనేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను జీటీబీ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు... నలుగురి మృతిట్రక్కు నిద్రపోతున్న వారిపైకి దూసుకురావడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో క్షతగాత్రుడని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
మరో వ్యక్తికి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వస్తున్న ట్రక్కు సీమపురిలోని డీటీసీ డిపో వద్ద రెడ్ లైట్‌ను క్రాస్ చేస్తూ నిద్రపోతున్న వారిపైకి దూసుకెళ్లింది. చనిపోయినవారిని కరీం (52), ఛోటే ఖాన్ (25), షా ఆలం(38), రాహుల్ (45)గా గుర్తించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.