శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (13:37 IST)

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: కాలి బూడిదైన షాపులు

దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 4.45 గంటలకు చాందిని చౌక్‌లోని లజ్ పత్ రాయ్ మార్కెట్లో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో 60 షాపులకు మంటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న 12 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. 
 
మంటల్లో షాపులు పూర్తిగా కాలి బుడిదయ్యాయి.  ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.