సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (14:24 IST)

మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు : డీఐజీ - ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

2014 అక్టోబరు, నవంబరులో ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని ఒక ఫ్లాటుకు తీసుకువెళ్లి ఖజన్ సింగ్, సుర్జిత్ సింగ్‌లు మూడురోజులపాటు తనపై అత్యాచారం చేశారని మహిళా పోలీసు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ సీఆర్పీఎఫ్ డైరెక్టరు, కేంద్ర హోంశాఖ కార్యదర్శులకు లేఖలు రాసింది. 
 
ఈ లేఖలపై స్పందించిన కేంద్ర హోం శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ప్రాథమిక దర్యాప్తులో మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన కేసులో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు (సిఆర్పీఎఫ్)డీఐజీ, ఇన్‌స్పెక్టర్లను ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 
 
30 ఏళ్ల వయసున్న మహిళా కానిస్టేబుల్‌ను సీఆర్పీఎఫ్ డీఐజీ, స్పోర్ట్సు ఆఫీసరుగా పనిచేస్తున్న ఖజన్ సింగ్, జట్టు కోచ్‌గా పనిచేస్తున్న ఇన్‌స్పెక్టరు సుర్జిత్ సింగ్ లైంగికంగా వేధించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. 
 
కాగా, 1986లో సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో డీఐజీ ఖజన్ సింగ్ రజతపతకం సాధించడం గమనార్హం. అలాగే, ఈయన అర్జున అవార్డును కూడా అందుకున్నారు. ఈ వ్యవహారంపై ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా దర్యాప్తు చేశారు.