1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (12:43 IST)

పిన్నీసు మింగిన ఐదు నెలల బాలుడు... ఐదు రోజుల పాటు నరకం...

pin
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల బాలుడు పిన్నీసు మింగేశాడు. దీంతో ఐదు రోజుల పాటు నరకం అనుభవించాడు. బాలుడి శ్వాసనాళంలో ఇరుకున్న పిన్నీసును వైద్యులు విజయవంతంగా బయటకు తీసి.. ఆ బాలుడి ప్రాణాలు నిలబెట్టారు. 
 
కోల్‌కతాకు సమీపంలోని హుగ్లీలోని జంగిపార ప్రాంతానికి చెందిన బాలుడిని పక్కనే ఆడుకుంటున్న తోబుట్టువుల వద్ద ఐదు నెలల పిల్లోడిని తల్లి మంచంపై పడుకోబెట్టింది. ఆ సమయంలో మంచంపై ఉన్న పిన్నీసును బాలుడు మింగేశాడు. ఊపిరి పీల్చుకోవడంలో అసౌకర్యం కలగడంతో గుక్కబెట్టి ఏడవసాగాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాధారణ జలుబుగా భావించిన వైద్యుడు.. దానికి అనుగుణంగా చికిత్స చేశాడు. 
 
అయినప్పటికీ బాలుడు ఏడుపు ఏమాత్రం ఆపకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గురువార మధ్యాహ్నం కోల్‌కతా వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎక్స్‌రే తీసి, చిన్నారి శ్వాసనాళం వద్ద పొడవాటి పిన్నీసు ఇరుక్కుని ఉందని గుర్తించారు. అదృష్టవశాత్తు అది శ్వాసనాళం లోపలికి వెళ్లలేదు. ఈఎన్టీ విభాగం వైద్యుడు సుదీప్ దాస్ ఆధ్వర్యంలోని వైద్య బృందం... దాదాపు 40 నిమిషాల పాటు ఆపరేషన్ చేసి ఆ పిన్నీసును విజయవంతంగా వెలికి తీశారు.