మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (09:34 IST)

మేఘాలయ రాష్ట్రంలో భూకంపం - రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు

earthquake
మేఘాలయ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.0గా నమోదైంది. సోమవారం ఉదయం 6.32 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. 
 
ఆ రాష్ట్రంలోని తురా అనే ప్రాంతానికి 43 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం కారణంగా స్వల్పంగా భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్.సి.ఎస్) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్టు పేర్కొంది. 
 
మరోవైపు, టిబెట్‌లోని జిజాంగ్‌ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. ఉదయం 4.01 గంటల సమయంలో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్‌ పేర్కొన్నది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరుగలేదని వెల్లడించింది.