గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (19:10 IST)

ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహించాలి.. మాయావతి డిమాండ్

సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) నేత మాయావతి బీజేపీపై మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలతో హైజాక్‌ చేసిందని మాయావతి వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ అధికారంలో ఉన్న బీజేపీ ఈవీఎంలను హైజాక్ చేసి దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి మహాకూటమిగా రంగంలోకి దిగిన బీఎస్పీ చతికిలపడింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎంలకు వ్యతిరేకంగా యావత్‌ భారతదేశమంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది, ఈ ఫలితాలను చూశాక దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయిందని ఆమె విమర్శించారు. 
 
ఈవీఎంలకు బదులు సాంప్రదాయ పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమండ్‌ చేశారు. ఎన్నికల సంఘం, బీజేపీ రెండూ కూడా బ్యాలెట్‌ పేపర్లను వ్యతిరేకిస్తున్నాయంటే వీరి మధ్య ఏవో రహస్య సంబంధం ఉందని మాయావతి ఆరోపించారు. మహాకూటమికి వచ్చిన స్పందన మేము ఊహించలేదని, ఫలితాలు ప్రజాభీష్టానికి భిన్నంగా వచ్చాయని ఆమె ఆరోపించారు.