శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (12:50 IST)

కళాశాలలో వేధింపులు.. పీహెచ్‌డీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

తమిళనాడు రాజధాని, చెన్నై నగరంలోని ఓ కళాశాలలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా ఇలాంటి ఘటనే సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లా పెరియార్ వర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
నివేద అనే విద్యార్థిని పీహెచ్డీ రెండో సంవత్సరం చేస్తూ, ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా నివేద రాసిన రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. 
 
ఇటీవల వర్శిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి, విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించారని, దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేసిందని విద్యార్థి సంఘాలు తెలియజేశాయి. నివేద కూడా ఆ అమ్మాయి విభాగమే కాబట్టి, పూర్తి పారద్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.