గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:20 IST)

ఆస్పత్రికి ట్రీట్మెంట్‌ కోసం పాముతో వెళ్లిన రైతన్న..

ఓ రైతన్న ఆస్పత్రికి వెళ్తూ వెళ్తూ నాగుపామును తనతో తీసుకెళ్లాడు. ఆ వృద్ధుడి చాకచక్యాన్ని ప్రస్తుతం నెటిజన్లు కొనియాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని చిన్నకండియన్‌కుప్పంకు చెందిన రంగనాథన్ అనే వృద్ధుడు.. తన తోటలో పనిచేస్తుండగా.. ఓ నాగుపాము ఆయన కాలిపై కాటేసింది. 
 
అయితే ఆ పాముకాటును పెద్దగా లెక్కచేయని ఆ వృద్ధుడు.. నొప్పిని తట్టుకుని వెంటనే ఓ గోనె సంచిలో ఆ పామును పట్టుకున్నాడు. ఆపై నాగుపాముతో కూడిన గోనెసంచిని తనతో వెంటబెట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. 
 
అయితే ఆ సంచిలోని రెండున్నర అడుగుల నాగుపామును చూసి రోగులు పరుగులు తీశారు. దీనిపై వైద్యులు వృద్ధుడి వద్ద ఆరా తీస్తే.. తన కాలిపై కాటేసిన పామును సంచిలో వేసుకుని తీసుకొచ్చానని చెప్పాడు. ఫలితంగా ఆ పాము విషాన్ని బట్టి వృద్ధుడికి వైద్యులు చికిత్స అందించారు. ఆపై ఆ పామును అటవీ శాఖా అధికారులు అందజేశారు. 
 
చికిత్స అనంతరం రైతు వృద్ధుడు రంగనాథన్ ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. ఏ పాము కరిచిందో తెలియక తికమకపడుతున్న వైద్యులకు కచ్చితమైన చికిత్స ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ పామును సంచిలో వేసుకొచ్చినట్లు వృద్ధుడు చెప్పాడు. అతని తెలివికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.