శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (16:05 IST)

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, నవంబరు 16 నుంచి మండల యాత్ర ప్రారంభం

కరోనావైరస్ కారణంగా అన్ని రాష్ట్రాలలో గల దేవాలయాలు మూతబడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వెళ్లే శబరిమల యాత్ర బ్రేకులు పడతాయని భావించారు. అయితే కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం యాత్రకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. నవంబరు 16 నుంచి మండల యాత్ర ప్రారంభిస్తామని ప్రకటించింది.
 
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా అనుమతి ఇస్తున్నట్లు ట్రావెన్‌కోర్ ట్రస్ట్ అధికారులు, కేరళ ప్రభుత్వం సంయుక్తంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై సోమవారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు రెండు నెలల పాటు శబరి గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగనున్నాయి. 
 
వర్చువల్ క్యూ విధానం ద్వారా పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్న వారికి మాత్రమే ఆలయం లోనికి అనుమతి ఉంటుందని తెలిపారు. పంబా నదిలో స్నానానికి అనుమతి లేదని తెలిపారు. దర్శనం తర్వాత వెంటనే భక్తులు వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలనుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.