సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (10:22 IST)

గుజరాత్ గార్బాకు యునెస్కో గుర్తింపు - ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడి

garba dance
గుజరాత్ రాష్ట్ర ప్రజల సంప్రదాయ నృత్యం గార్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు. గార్బా నృత్యం నవరాత్రి ఉత్సవాల్లో కనువిందు చేసే నృత్య కార్యక్రమంగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. అలాంటి నృత్యానికి యునెస్కో గుర్తింపు ఇవ్వడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు గర్వకారణమని ముఖ్యమంత్రి పటేల్ వెల్లడించారు. మన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇది స్ఫూర్తినిస్తుంందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 
 
నవరాత్రి రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి వీధిలోనూ గార్భా నృత్యం కనువిందు చేస్తుంది. అంతేకాకుండా నవరాత్రుల రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఈ నృత్యం కనిపిస్తుంది. అలాంటి నృత్యానికి ఇపుడు యునెస్కో గుర్తింపు లభించిందని, గుజరాత్‌కు గుర్తింపుగా మారిన యూనెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితా కింద ఆమోదించిందని సీఎం పటేల్ వెల్లడించారు. గర్బా రూపంలో మాతృమూర్తికి అంకితం చేసే పురాతన సంప్రదాయం సజీవంగా ఉంటూ, మరింత ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు ఇది గర్వకారణమని తెలిపారు. 
 
అలాగే, ఈ అరుదైన గుర్తింపుపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఈ గౌరవం మన వారసత్వాన్ని సంరక్షించుకోవడానికి, భవిష్యత్ తరాలను అందించేందుకు తమకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ గ్లోబల్ గుర్తింపునకు అభినందనలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. 
 
కాంగ్రెస్ అసంతృప్తులతో కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు : కడియం శ్రీహరి  
 
భారత రాష్ట్ర సమితి తరపున స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలిచిన మాజీ మంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే భారాస ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ప్రకటించారు. ఇందుకోసం ప్రస్తుతం అసెంబ్లీలోని వివిధ పార్టీలకు ఉన్న బలాబలాలను కూడా వెల్లడించారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చాయని గుర్తు చేసిన ఆయన భారాసకు 39 సీట్లు మాత్రమే వచ్చాయనని చెప్పారు. తమ మిత్రపక్షమైన ఎంఐఎంకు ఏడు సీట్లు వచ్చాయని, అలాగే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీకి మరో ఎనిమిది సీట్లు వచ్చాయన్నారు. ఇవన్నీ 54 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులతో కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. 
 
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అనేక మంది గందరగోళంలో ఉన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం పెద్ద కష్టమైన పని కాదన్నారు. కానీ కేసీఆర్ సింహంలా వస్తారని, సమయం చెప్పలేమన్నారు. కానీ మిత్రులతో కలిసి తమ స్థానాలు 56కు చేరుకుంటాయని చెప్పారు. సింహం రెండు అడుగులు వేసిందంటే వెనక్కి వేస్తోందంటే వేటకు సిద్ధమైనట్టేనని అన్నారు. కేసీఆర్ అనే సింహం త్వరలోనే బయటకు వస్తుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన పార్టీ నేతలకు, శ్రేణులకు ధైర్యం చెప్పారు.