మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (11:55 IST)

ఢీకొన్న ట్రక్కులు - రూ.కోటి విలువ చేసే మద్యం దగ్ధం

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తారావాడీ - శంగఢ్ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే మద్యం దగ్ధగమైపోయింది. నలాగఢ్ నుంచి ఢిల్లీ వైపునకు వెళుతున్న ట్రక్కులో విస్కీ మద్యాన్ని తీసుకెళుతున్నారు. ఆ సమయంలో రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. 
 
తొలుత శామ్‌గడ్ సమీపంలోని ఓ ట్రక్ డ్రైవర్ మొదటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ఆ ట్రక్కు ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి మద్యం లోడుతో వచ్చిన ట్రక్కు రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రక్కులు రెండు పూర్తిగా కాలిపోయాయి.
 
స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో రూ.కోటి విలువ చేసే మద్యం కాలిపోయింది. అలాగే, రెండు లారీలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది.