సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (20:36 IST)

కాలువలో తల లేని యువతి మృతదేహం...

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా లఖీపురా ప్రాంతంలో శుక్రవారం తల లేని యువతి మృతదేహం లభ్యమైంది. లఖీపురా ప్రాంతంలోని లేన్ నంబర్ 28 సమీపంలోని డ్రెయిన్‌లో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలికి ఇరవై ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ ప్రాంతంలో తప్పిపోయిన మహిళల వివరాలను సేకరించేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సమీపంలోని పట్టణాల్లో తప్పిపోయిన మహిళల జాబితాను కూడా సేకరించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. హ‌త్య‌కు గురైన‌ మహిళ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.