బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (11:55 IST)

కేరళలో హై అలర్ట్.. భారీ వర్షాలు... అయ్యప్ప భక్తులు బురదలో ప్రయాణం..

Sabarimala
Sabarimala
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలను ఫెయింజల్ తుఫాను ఒణికిస్తోంది. ఈ తుఫాను ఎఫెక్ట్ కేరళపై పడింది. ముఖ్యంగా ఫెయింజల్ తుఫాను ప్రభావంతో కేరళలోని పతనంతిట్ట జిల్లాలో గ్యాప్ లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి కొలువైన పత్తనంతిట్టలో వర్షాలతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలినడక వెళ్లే అయ్యప్ప భక్తులు బురదలో వెళ్లాల్సి వస్తోంది. ఎక్కడ జారీ పడతారనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. 
 
పాతానంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా శబరిమల యాత్రికులు నదుల్లోకి వెళ్లడం లేదా స్నాన ఘాట్‌లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో శబరిమలకు అయ్యప్ప స్వాముల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం విపత్తు నిర్వహణ సహాయక బృందాలను రంగంలోకి దింపింది.