మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (16:38 IST)

ఢిల్లీ జహంగీర్ పుర‌లో 144 సెక్షన్ అమలు

police
దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో ఢిల్లీలోని జహంగీర్ పుర‌లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు. 
 
కాగా హనుమాన్ శోభాయాత్ర సమయంలో రెండువర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఈ అల్లర్లలో గాయపడిన తొమ్మిది మందిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ శోభాయాత్ర మసీదు వద్దకు చేరుకోగానే చిన్నపాటి గొడవ మొదలై ఆ తర్వాత పెద్దదిగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అయితే, వదంతులు నమ్మొద్దని ప్రజలందరూ సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు.